తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. సంకెళ్లు తెంచి స్వేచ్ఛ ను పంచి జనం ఆకాంక్షలను నిజంచేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతి ఇచ్చిందని పేర్కొన్నారు. పేదల గొంతుకు వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇకపైనా తన బాధ్యత నిర్వర్తిస్తానని సుదీర్ఘ పోస్టు చేశారు.
Revanthreddy
భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడం, కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందింది. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు… నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు… నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు… నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు… నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే…’ అని రేవంత్ పేర్కొన్నారు. నీలాంటి వాడిని చూసే… ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ లు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా జిట్టా తోడుగా ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణను ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోందని… కానీ, ఎన్నో బాధలు పెట్టిన తర్వాతే రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణను ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.





Total views : 146880