93
గగన్‌యాన్.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం పై ప్రధాని మోదీ స్పందించారు. భారత మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష మిషన్ ‘గగన్‌యాన్’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకే చేపట్టేందుకు ఇస్రో యత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి.. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.