ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఉదంతంపై ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు.శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.
117
previous post