చాలా మంది వెన్న తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని తినడానికి ఇష్టపడరు. అయితే ఏ పదార్థానైనా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచి ఫలితాలు లభిస్తాయి. కనుక ఎటువంటి భయం లేకుండా పరిమితంగా వెన్నను తీసుకుంటే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. వెన్నెలో శరీరానికి శక్తినందించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ లను తగ్గించడానికి వెన్న సమర్ధవంతంగా సహాయపడుతుంది. వెన్నెలో ఉండే మంచి కొలెస్ట్రాల్, కొవ్వులు పిల్లల మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కనుక పిల్లలకు వెన్నతో చేసిన పదార్థాలను ఇస్తే వివిధ రకాల పోషకాలు వారికి అందుతాయి. ఫ్రెష్ గా తీసిన వెన్న ను ఎదిగే పిల్లకు రోజు పెట్టవచ్చు.
Read Also..
Read Also..