అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో ఘనంగా 157 వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. గుత్తి రైల్వే స్టేషన్ ప్రారంభమై 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే సీనియర్ డీసీయం మనోజ్ కుమార్, డీఎంఈ ప్రమోద్ కుమార్, రైల్వే వైద్యాధికారి వెంకటేష్ తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. సీనియర్ డిసిఎం మనోజ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిషర్స్ హయాంలో రైల్వే స్టేషన్ ని స్థాపించారన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైల్లు రాకపోకలు కొనసాగుతున్నాయన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
రైల్వే స్టేషన్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు..
146
previous post