టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని తెలిపారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్ ను కూల్చేయించారని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్య్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేశ్, కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
venkatesh
దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘క్లాస్ ఇన్నింగ్స్. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్డే సెలబ్రేషన్స్ ఉండవు’ అంటూ వెంకటేశ్ క్యాప్షన్ ఇచ్చారు.
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో ఘనంగా 157 వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. గుత్తి రైల్వే స్టేషన్ ప్రారంభమై 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే సీనియర్ డీసీయం మనోజ్ కుమార్, డీఎంఈ ప్రమోద్ కుమార్, రైల్వే వైద్యాధికారి వెంకటేష్ తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. సీనియర్ డిసిఎం మనోజ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిషర్స్ హయాంలో రైల్వే స్టేషన్ ని స్థాపించారన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైల్లు రాకపోకలు కొనసాగుతున్నాయన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.




Total views : 79420