ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కేసీఆర్. మంచిర్యాల జిల్లా
మందమర్రిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాకముందు భయంకర పరిస్థితులు ఉండేవని,
సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే. వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2.184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. బాల్క సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు.సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి.. కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి అని కేసీఆర్ అన్నారు