ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చివరి లిస్ట్‌లో నీలం మధు ముదిరాజ్‌కు బదులు కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయిస్తు ప్రకటన విడుదల చేసింది. దీంతో నీలం మధు ముదిరాజ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే రాత్రి తన అనుచరులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ మా జాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పుడు నా అభ్యర్థిత్వాన్ని మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నన్ను, నా జాతిని నమ్మించి గొంతు కోశారు. మా జాతి ఆత్మ గౌరవాన్ని చులకన చేశారు. మాకు జరిగిన మోసానికి తగిన ప్రతిఫలం తప్పదు. ఎవరెన్ని అవమానాలు చేసిన బరి తెగించి కొట్లాడతా.. బరా బర్ పటాన్ చెరు ఎమ్మెల్యే బరిలో ఉంటాను. నన్ను నమ్ముకున్న ప్రజల, కార్యకర్తల కుటుంబ పెద్దగా అండగా నిలబడతాను. కడుపులో పెట్టి చూసుకుంటా.. నా అనుచరులతో కలిసి నామినేషన్ వేస్తాను.. నాకు జరిగిన మోసాన్ని వివరిస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని నీలం మధు ముదిరాజ్ తేల్చి చెప్పారు.
కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ విడుదల..
137
previous post