హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే పడినప్పటి నుండి ఏదేదో మాట్లాడుతున్నాడని, ఆయన ఆస్పత్రిలో చూపించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ కు చాలా అన్యాయం జరిగిందని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, ఎవరికి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో పెప్పేర్ స్ప్రే పడ్డ తర్వాత పొన్నం ప్రభాకర్ ను బయటికి తీసుకు వచ్చారని, అయన బయటికి వచ్చిన తర్వాతే తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. దానికి ఆయన కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందంటూ పొన్నం ప్రభాకర్ ప్రగల్బలు పలుకుతున్నాడని ఎద్దేవ చేశారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో మిషన్ కాకతీయ ద్వారా 465 చెరువులను అభివృద్ధి చేశామని దాంతో హుస్నాబాద్ లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా బిఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also..