పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈనెల 15వ తేదీన టిడ్కో గృహాల సముదాయంలో పాలకొల్లు చూడు అనే వినూత్న కార్యక్రమం, బహిరంగ సభ జరుగుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులతో కలిసి వంటావార్పు కార్యక్రమం చేపట్టమన్నారు. కాగా పోలీసుల బలగంతో మాకు పోటీ సమావేశం పెట్టాలని వైసీపీ చూడటం అప్రజాస్వామికం, అరాచకం అన్నారు. అయినా భయపడేది లేదు, తిరుగుబాటు మొదలైందని వేలాది ప్రజలతో రేపు సభ నిర్వహిస్తామని చెప్పారు. లబ్దిదారులు సొంత ఇంటికి చేరకముందే వారిని ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణగ్రస్తులను ఆయన విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే కుట్రతోనే టిడ్కో గృహాలను ప్రభుత్వం పేదలకు అందించడం లేదని విమర్శించారు. ఈకార్యక్లమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సిద్దిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడారు.
రేపు పాలకొల్లులో వినూత్న కార్యక్రమం..
63
previous post