బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని.. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే ఈ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదన్నారు. కేసీఆర్‌కు సీఎంగా అవకాశం ఇస్తే అడుక్కునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. బై ఎలక్షన్ వస్తే కుర్చీ అక్కడే వేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ముఖం చాటేశారన్నారు. ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వేట కుక్కల్లాగా ఓట్లు అడుక్కుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్‌ఎస్ సర్కార్ ఉందన్నారు. అంటే ఆగడు.. పంటే లేవడు… అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏంళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫక్తు రాజకీయాలతో తెలంగాణ ఆగమవుతోందన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో.. ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరిస్థితి మారిందని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల డీఎన్ఏ అవినీతి మాత్రమే అని అన్నారు. పూటకో అవినీతికి పాల్పడుతున్నాయని ఎంపీ ఆరోపించారు.
10 ఏళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా ?
70
previous post