వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మండి పడ్డారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. అధికార పార్టీ నేతలకు ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల విషయంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ రైతుల పాలిటి ఇరిటేషన్ మినిస్టర్ గా మారారని మండిపడ్డారు. ఇద్దరు మంత్రులు ఉన్నాశ్రీకాకుళం జిల్లాలో వరి పొలాలు ఎండిపోతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. సిఏం శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టకమునిపే కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. ఏంపి.వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఎలా కేసులు పెట్టాలో ఆలోచిస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేయటం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల పండించుకున్న పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
వైసిపి ప్రభుత్వం పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం..
72
previous post