నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ నేత నారాయణ ఏం చేశారో చెప్పాలని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత ఎటు వెళ్లిపోతారో తెలియని వ్యక్తికి ఓటు వెయ్యాలా అన్న ఆలోచనలో నెల్లూరు నగర ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు. 47వ డివిజన్ ప్రాంతంలో మాజీ మంత్రి అనిల్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా టిడిపి వైపే ఉన్నారంటూ నారాయణ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అనిల్ ఎద్దేవా చేశారు. నారాయణ వెంట కార్యకర్తల కంటే.. పేటీఎం బ్యాచ్ వ్యక్తులే ఉన్నారని విమర్శించారు.రానున్న ఎన్నికలలోనూ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేసుకోవడం మంచిదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రజలంతా వైసిపి వెంట నడుస్తున్నారని అన్నారు. మరోసారి వైసిపి విజయం తధ్యమని దీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..