86
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమల్ నగర్ లతో పాటు పలు ప్రాంతాలలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి, ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి పరమేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.