75
సనత్ నగర్ నియోజకవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ నీలిమ ఇంటింటి ప్రచారం బన్సిలాల్ పేట్ డివిజన్ లోని బలరాం కాంపౌండ్, పద్మారావు నగర్ హమాలి బస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ… నగరంలో అభివృద్ధి జరుగుతుంటే పద్మరావు నగర్ లో రోడ్లు, హమాలీ బస్తీ ఎందుకు అంత అధ్వనంగా ఉందని ప్రశ్నించారు. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.