టీడీపీ మాజీమంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సెటైర్లు వేశారు. నెల్లూరులో వైసీపీ చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు భ్రమపడుతూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. నెల్లూరు 16 వ డివిజన్ లో ఆయన పర్యటించారు. 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాలుగున్నర ఏళ్లలో ప్రజలకు ఏనాడు కనపడని నారాయణ నేడు ప్రజలంతా తననే కోరుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నారాయణ వెంటే ఉండే ఆయన మేనేజర్ కూడా ఆయన కోసం పని చేస్తాడో పక్కవారి కోసం పనిచేస్తాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో భారీ దోపిడీకి పాల్పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నారాయణకు దమ్ముంటే చర్చకు రావాలని అప్పుడు ప్రజలే ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుతారన్నారు. ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలన్నారు.
టీడీపీ నేత నారాయణపై అనిల్ కుమార్ సెటైర్లు..
66
previous post