తెలంగాణ – ఆంధ్రాలో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అప్పు ను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అల్తాఫ్ చీరాల పట్టణానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం కోదాడలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై ఇప్పటికై 70 దొంగతనం కేసులు ఉన్నాయని ఏసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు. తాళాలను వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట దొంగతనం చేయడం ఇతని నైజమన్నారు. ఇతనికి సహాయం చేసే కంచికచర్ల చెందిన మరో దొంగ మణికంఠను కూడా అదుపులోకీ తీసుకున్నామని తెలిపారు. నందిగామ, విజయవాడ, జగ్గయ్యపేట, ఖమ్మం, కోదాడ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు చేస్తున్నాడని ఏసిపి తెలిపారు. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి టెక్నికల్ ఆధారాల ద్వారా దొంగను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు. జల్సాలకు అలవాటు పడి సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ధ్యేయంతోనే దొంగతనాలు చేస్తున్నాడని ఎసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు.
మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
102
previous post