తెలంగాణ – ఆంధ్రాలో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అప్పు ను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అల్తాఫ్ చీరాల పట్టణానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం కోదాడలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై ఇప్పటికై 70 దొంగతనం కేసులు ఉన్నాయని ఏసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు. తాళాలను వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట దొంగతనం చేయడం ఇతని నైజమన్నారు. ఇతనికి సహాయం చేసే కంచికచర్ల చెందిన మరో దొంగ మణికంఠను కూడా అదుపులోకీ తీసుకున్నామని తెలిపారు. నందిగామ, విజయవాడ, జగ్గయ్యపేట, ఖమ్మం, కోదాడ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు చేస్తున్నాడని ఏసిపి తెలిపారు. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి టెక్నికల్ ఆధారాల ద్వారా దొంగను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు. జల్సాలకు అలవాటు పడి సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ధ్యేయంతోనే దొంగతనాలు చేస్తున్నాడని ఎసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు.
Tag:
Andhra
ఆంధ్రా,తమిళనాడు సరిహద్దులో ఎర్రచందనం దుంగలును తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుండి సుమారు 4కోట్ల రూపాయలు విలువచేసే ఎర్రచందనం, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 5 గురు స్మగ్లర్లు ఆంద్ర సరిహద్దు పన్నంగాడు చెక్ పోస్టు వద్ద అరెస్టు చేసారు. అనంతరం వారిని తిరుపతి హెడ్ క్వార్టర్ కి తరలించారు. పట్టుబడ్డవారిలో ఒకరిపై ఇప్పటికే పీడీ యాక్ట్ ఉన్నట్లు సమాచారం. గత నెల జైల్లో నుంచి విడుదలై మరల స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డినట్టు గుర్తించారు.






Total views : 80436