వరంగల్ ఉమ్మడి జిల్లాలో BRS ఎమ్యెల్యే అభ్యర్థులకు వ్యతిరేక పవనాలు తప్పడం లేదు. తాజాగా వర్ధన్నపేట ఎమ్యెల్యే అభ్యర్థి అరూరి రమేష్ పై నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల్ మండపల్లి గ్రామాన్ని గత తొమ్మిది సంవత్సరాల బట్టి దత్తత తీసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మడిపల్లి గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని 2018లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు మీద వందల ట్రిప్పుల ఇసుక ముఖ్య అనుచరుడు అమ్ముకున్నారు. ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఒక దళిత బంధు యూనిట్ కొత్త రేషన్ కార్డు ఏవి కూడా మడిపల్లి గ్రామ ప్రజలకు అందలేదని ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు లేదని మడిపల్లి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..