ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తో కలిసి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈరోజు డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని హోటల్ నుండి ప్రారంభమై ఎస్సీ బస్తి, మాల బస్తీ, అంజయ్య నగర్, హాస్మత్ పెట్టు, మల్లికార్జున నగర్ కాలనీ, వివిధ బస్తిలలో వేలాదిమంది కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పాదయాత్ర చేపట్టారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మరి అదే విధంగా కూకట్పల్లి నియోజకవర్గం లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లు నీ కోరారు. నియోజకవర్గంలో పాటు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ ను కూడా ఇంకా అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం..
67
previous post