75
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మ్యానిఫేస్టోను విడుదల చేసి అందరికంటే ముందున్న కేసీఆర్ ప్రచారంలో కూడా దూసుకువెళుతున్నారు. రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటూ మూడోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే మరోసారి కారు పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా మధ్యాహ్నాం నుంచి మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.