84
మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈవాళ మ.2:15 గంటలకు హైకోర్టు విచారించనుంది. నిన్న జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని రెండు బ్రూవరీస్, మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని రాష్ట్ర బ్రూవరీస్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర వేర్వురుగా హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా చంద్రబాబు తరఫున న్యాయనాది నాగముత్తు వాదనలు వినిపించారు.