ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఒక దశాబ్ధం ముందే గుండెపోటు రిస్క్‌ని గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా పరిశోధకులు. యూకేలోని 8 ఆస్పత్రుల్లోని 40,000 మంది సాధారణ కార్డియాక్ సీటీ స్కాన్ డేటాను విశ్లేషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. చివరికి వైద్య రంగంలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఊహకందని ఎన్నో అద్భుతాలకు తెర తీస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పదేళ్ల ముందుగానే గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని సుమారు మూడేళ్ల పాటు పరిశోధించారు. హృదయ ధమనిలో పూడికతో సంకుచితంగా ఉన్నవారు తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. పరిశోధనల్లో భాగంగా ఏఐని ఉపయోగించి ధమనులు, దాని చుట్టూ ఉన్న కోవ్వులో మార్పులపై సమాచారాన్ని అలాగే ధమనుల్లో రక్తమార్గం సన్నగా ఉండటాన్ని గుర్తించేలా ఏఐ టూల్‌కి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ టెక్నాలజీ గుండె సంబంధిత ప్రమాదాలను కచ్చితంగా అంచనా వేయగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై పరిశోధకులు మాట్లాడుతూ. ‘ధమనుల్లో ఎలాంటి అడ్డంకుటు లేనివారిలో, వారి రక్తనాళాల్లో వాపు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే ఇతరుల్లో గుండె సంబంధిత మరణాలు 10 రెట్లు ప్రమాదం ఎక్కువగా ఉంద’ని తెలిపారు. పరిశోధనల్లో భాగంగా 744 మంది రోగులకు సంబంధించి ఏఐ రూపొందించిన రిస్క్ స్కోర్ వైద్యులకు అందించింది. ఛాతీనొప్పితో బాధపడుతున్న రోగుల వివరాలను అందించడం ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.
పదేళ్ల ముందే గుండె పోటును గుర్తించే టెక్నాలజీ..!
58
previous post