86
ఈనెల 26,27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిని సందర్శిస్తున్నారు. 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు. తిరుమల వెళ్ళి రాత్రి బస చేసి, 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదుకు బయలుదేరి వెళతారు. ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.