చండూరు పట్టణ కేంద్రంలో రోడ్డు షో నిర్వహించిన బిజెపి అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి,పాల్గొన్నా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి. చలమల కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రేషన్ బియ్యం నుండి మొదలుకుని గ్రామపంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, ఉపాధిహామీ పథకం,స్మశాన వాటికలు,మరుగుదొడ్లు నిర్మాణం అన్నింటికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు. కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు రాష్ట్రానికి , వేల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ కుప్పకూలింది. రేషన్ కార్డ్ ఇస్తే ఎక్కడ ప్రధానమంత్రి ఫోటో కార్డ్ పై వేయాల్సి వస్తుందని ఇంతవరకూ కార్డ్ లు ఇవ్వలేదు. నేను రైతు బిడ్డను, ఈ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనీ వస్తున్నా. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రేస్ నుండి సీటు రాకుండా చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి లాగా కాంట్రాక్టు ల కోసం నేను రాజకీయాలు చేయడం లేదు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అసమర్థ ఎమ్మెల్యే సేవలు ఇక చాలు. ఆయనకు మాట్లాడే ధైర్యం లేదు. నను గెలిపిస్తే ప్రతి గ్రామానికి కేంద్ర నిధులతో రోడ్లు వేయిస్తా. దళిత్బంధు ,అని గొర్లు అని మాయమాటలు చెప్పే వారిని ఓడించాలి. ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాలు ,ఎమ్మెల్సీ గా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఆయన్ని గెలిపిస్తే మీకు మళ్ళీ దొరకడు. జిల్లాలో సీనియర్ లీడర్స్ అని చెప్పుకే కొంత మంది నాయకులకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులు అభివృద్ధి చేయలేదు. అవినీతి నాయకుడు ఒకరు,అహకరం నాయకుడు మరొకరు. కేంద్రం నిధులతోనే నేడు మండల కేంద్రాలలో, గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. మునుగోడు నియోజకవర్గం లో కమ్యూనిస్టు , కాంగ్రెస్, టిఆర్ఎస్ జండాలు ఎగిరినవి అభివృద్ధి శూన్యం. ఒకసారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని అన్నారు.
బిజెపి అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి రోడ్డు షో: చండూరు
87
previous post