తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకోసం ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 273 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికల ప్రక్రియ జరగనుండగా, 233733 మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రొసీడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్ తో పాటు ముగ్గురు పోలింగ్ అసిస్టెంట్లను నియమించడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారికి తెలిపారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు, 100 మీటర్ల పరిధిలో ఎవరిని అనుమతించమని తెలిపారు. ఓటర్లు తమ ఓటును నిర్భయంగా తమకు నచ్చిన వారికి ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.
Read Also..