తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్ మరో గంటంలో పూర్తి కానుంది. అయితే చాలా చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 3 గంటల వరకు అత్యధికంగా మెదక్‌లో 69.33 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం మాత్రమే నమోదైంది. అన్ని జిల్లాల కంటే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడంతో ఓటు వేసేందుకు నగర ఓటర్లు బయటకు రావాలని ఈసీ పిలుపునిచ్చింది.
చాలా పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు. నేరుగా వెళ్లి ఓటేసి వచ్చేంత ఖాళీగా ఉన్నాయి. నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, సర్కిళ్లలో ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించాయి. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పోలింగ్ రోజున టూర్లకు వెళ్లకుండా ఓటు వేసేలా వారిని చైతన్యం చేసేందుకు అధికారులు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. అయినా పరిస్థితి మారడం లేదు దీంతో హైదరాబాదీలు ప్లీజ్ బయటకు వచ్చి ఓటేయండి, ఓటు వేయటం కోసమే సెలవు ఇచ్చింది. ఎన్నికల అధికారులు ప్లీజ్ రండి ఓటేయండి అంటున్నారు.
మరో గంటంలో పూర్తి కానున్న పోలింగ్
85
previous post