64
రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా 567.94 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.