70
సుమారు పదేళ్ల తర్వాత గాంధీభవన్ పూర్తి స్థాయిలో కళకళలాడుతున్నది. అన్ని జిల్లాల నుంచి లీడర్లు, కేడర్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది. గాంధీభవన్లో పూలు, పటాసులతో సంబరాలు చేసుకుంటున్నారు. జై సోనియామ్మ జై రేవంత్ అని నినాదాలతో భవన్ హోరెత్తుతున్నది. బై బై కేసీఆర్ అంటూ కార్యకర్తలు నినాదిస్తున్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ, రేవంత్ చిత్రపటానికి పెద్ద ఎత్తున పూలు చల్లుతున్నారు.