రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురా లిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ,ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Sonia Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇది చదవండి: యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం
రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని సోనియా పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్న వాయిదా పడింది. కాగా, సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా యాత్రను ఒక్కరోజు నిలిపివేశారు. జైపూర్‌లో సోనియా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు రాహుల్ వెళ్లడంతో యాత్ర రద్దైనట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని హస్తం పార్టీ ప్రకటించింది. ఔరంగాబాద్‌లో నేటి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.by CVR NEWSదేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.by CVR NEWSటీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.by CVR NEWSలోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్‌సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన…
అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మమార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అనేక మందిని ఆహ్వానించింది. నాలుగు వేల మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులకు ట్రస్టు ఆహ్వాన పత్రికలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సీనీక్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, సంజయ్‌లీలా భన్సాలీ, అలియా భట్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, అజయ్ దేవ్గన్, చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్, రిషభ్ శెట్టి, ప్రభాస్, టైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, అరుణ్ గోవిల్, దీపికా చిఖాలియా నటీనటులకు ఆహ్వానాలు అందాయి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్‌టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. క్రీడాకారులలో సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. రాజకీయ నాయకులలోమల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి,, డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడ, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఉన్నారు.
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది. ఆ జోష్ ను కంటెన్యూ చేసేందుకు…పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ లను నియమించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ కు రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ – ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ లను నియమించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించారు. అలాగే అసెంబ్లీలో విద్యుత్, ఇరిగేషన్, ఆర్థికపరిస్థితిపై సభలో మూడు రోజుల పాటు చర్చ నిర్వహించాలని తీర్మానించారు.
రాజకీయంగా తనకు మరోసారి హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ను గజమాలతో సత్కరించి, పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత తనదన్నారు. సెంటిమెంట్ కాదు, హుస్నాబాద్ లో డెవలప్మెంట్ మొదలయిందని పేర్కొన్నారు. భూనిర్వాసితులను బతిమిలాడైనా నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని వెల్లడించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తానని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మందరం కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిగా అభివృద్ధి చేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికెళ్లిన గళ్ళ ఎగిరేసుకునే విధంగా పనిచేస్తానని, ప్రతిరోజు ఉదయం హుస్నాబాద్ లో ఉంటే, సాయంత్రం హైదరాబాద్ లో, సాయంత్రం హైదరాబాద్ లో ఉంటే ఉదయం హుస్నాబాద్ లో ఉంటానన్నారు.
ఈరోజు సోనియా గాంధీ 77 వ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ దేవదేవుడుని పరమేశ్వరుడిని ప్రార్థించడమైనది. అలాగే సోనియాగాంధీ కి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ల మ్యానిఫెస్టోలో ఈరోజు రెండు గ్యారంటీ పథకాలను అమలులోకి తీసుకుని వస్తున్నారు. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సలీం పాష, మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య, రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి పింగళి రాకేశ్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొట్టే ప్రభుదాస్, బిసి సెల్ పట్టణ అధ్యక్షులు తంగెళ్ళ క్రిష్ణా మోహన్, కాంగ్రెస్ నాయకులు పోతుల శ్రీనివాస్, యం.డి సలీం, ముద్ధమల్ల రవి, NSUI రాష్ట్ర నాయకులు పర్లపెల్లి నాగరాజు, జిల్లా St cel కార్యదర్శి మానుపాటి సూర్య చిలువేరు రాజమౌళి, మొలుగూరి సమ్మయ్య, గుర్రపు మురళి, గుర్రపు ప్రవీణ్, గుల్లీ సమ్మయ్య, చిట్యాల శంకర్, పోతిరెడ్డి మల్లయ్య, సిరిపురం కుమార్, చెంచల శ్రీనివాస్, పైడిపల్లి అయోధ్య, గడ్డం రమేష్, అకినపెల్లి మహేందర్, రాజ్‌కుమార్ , అశోక్, దొడ్డె నవీన్, పాతకాలం అనిల్, పనికెల్లా శ్రీకాంత్, మొలుగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు భారీగా రావడంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో కోలాహాల వాతావరణం నెలకొంది.
Read Also…
Read Also…
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. వీరికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ స్వయంగా పలువురు అగ్రనేతలను ఆహ్వానించారు. పక్క రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడిచింది. అయితే తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరులో ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభయ హస్తం అందించారు.
పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయి రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. రజినీ బాధను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకుసోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున, వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.
రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమెకు తొలి ఇద్యోగం ఉచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు జరిగే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి రజినీకి ఆహ్వానం పంపించారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిసింది.