Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home National ఎల‌క్టోర‌ల్ బాండ్ల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎల‌క్టోర‌ల్ బాండ్ల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by Satya
Supreme Court

ఎల‌క్టోర‌ల్ బాండ్ల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువ‌రించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఆ తీర్పును ఇచ్చింది. కేంద్ర స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై కోర్టు తీర్పును వెలువ‌రించింది. బ్లాక్ మ‌నీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు అని కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, బీఆర్ గ‌వాయి, జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాలు ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని సీజేఐ చంద్ర‌చూడ్ తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చ‌ట్టంలో 29(1)సెక్ష‌న్ స‌వ‌ర‌ణ రాజ్యాంగ వ్య‌తిరేకం అవుతుంద‌న్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేసే బ్యాంకులు త‌క్ష‌ణ‌మే బాండ్ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజ‌కీయ పార్టీలు వివ‌రాల‌ను ఎస్‌బీఐ బ్యాంకు వెల్ల‌డించాల‌ని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నిక‌ల సంఘానికి ఆ వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్ర‌తి బాండ్‌కు చెందిన వివ‌రాల‌ను ఎస్బీఐ వెల్ల‌డించాలి. Raed Also..

Follow us on : FacebookInstagram & YouTube.

  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
    నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్…
  • తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
    తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

026185
Total views : 150012

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.