Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National నేటి నుంచి రాహుల్‌ యాత్ర పునః ప్రారంభం

నేటి నుంచి రాహుల్‌ యాత్ర పునః ప్రారంభం

by Satya
Rahul Gandhi

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్న వాయిదా పడింది. కాగా, సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా యాత్రను ఒక్కరోజు నిలిపివేశారు. జైపూర్‌లో సోనియా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు రాహుల్ వెళ్లడంతో యాత్ర రద్దైనట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. బీహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని హస్తం పార్టీ ప్రకటించింది. ఔరంగాబాద్‌లో నేటి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారు.

Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
    కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట…
  • బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..
    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు యూరప్ దేశాల పర్యటనకు వెళ్లనున్న ఆయన, మార్గమధ్యంలో కేవలం మూడు, నాలుగు గంటల పాటు అబుదాబిలో ఆగే అవకాశం ఉంది. ఈ…
Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62199

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.