67
రైతులకు కనుపూరు కెనాల్ సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ తో పాటు సర్వేపల్లి రైతులు కూడా ఈ కెనాల్ పై ఆధారపడి ఉన్నారన్నారు. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కూడా నిండాయన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read Also..