మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో పి గన్నవరం నియోజకవర్గంలో నిన్నటి నుండి ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దవుతున్న వరిచేలు, కోత కోసి పనల మీద ఉన్న వరి మరియు వరి రాశులు. ప్రభుత్వ గిట్టుబాటు ధర ఒకవైపు, పంట చేతికి వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలు మరొక వైపు.. ప్రతి రైతు అప్పులు పోరాటం తప్ప ఏ సీజన్లో కూడా రైతుకు ప్రభుత్వ పరంగా గాని ప్రకృతి పరంగా గాని ఏ విధమైన సహాయాలు అందట్లేదని రైతులు వాపోతున్నారు.. గతంలో ఏదో ఒక షావుకారు దగ్గర పంట వచ్చిన తర్వాత ఇస్తామని ఎరువులు లేకపోతే కూలీ డబ్బులు ఇవ్వడానికి అప్పులు తెచ్చుకునే వాళ్ళం.. పండించిన పంట ప్రభుత్వానికి అమ్మాలి అని నినాదం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం, తేమ ఎక్కువ ఉన్న ధాన్యం, కొనట్లేదని దాని వలన రైతులు అప్పుల పాలవుతున్నారని కౌలు రైతు కు వచ్చేసరికి సిస్తు కట్టాలి.. దుక్కులు చేయించాలి,ఎరువులెయ్యాలి పనిచేసిన ప్రతి ఒక్కరికి సాయంత్రానికి కూలి సరిపెట్టాలి ఎకరానికి సుమారు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి కొట్టే దెబ్బకు రైతు కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాడని ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించాలని రైతుకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వానికి మరియు అధికారులకు.. అభ్యర్థన చేసుకుంటున్నారు..
అన్నం పెట్టే రైతన్నల ఆకలి కేకలు.. అప్పుల బాధలు…
101
previous post