సీఎం జగన్ (CM Jagan) :
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ (CM Jagan) పిలుపునిచ్చారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ ప్రసంగించారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని, తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య క్లాస్ వార్ జరుగుతోందన్నారు. తాము గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పశుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు వేసే రెండు ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థులకే వేయాలని సీఎం కోరారు. ఫ్యాన్‌కు ఓటేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే 3 వేలు పింఛన్ అందుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ దోచుకుంటాయన్నారు. వైసీపీకి ఓటు వేస్తే లంచాలు, వివక్షత లేని పారిపాలన అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్లో నాలుగు పులి కూనలు హల్చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని…
- అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రోగులకు అందుతున్న వైద్య…
- కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ మేరకు…




Total views : 223713