సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈతకోట గ్రామంలో పనులు లేక కర్రి వారికి కుటుంబం వలసపోతున్న క్రమంలో రావులపాలెం వద్ద ఏమీ తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఓ బాలిక దారి చూపి కోప్పవరం గ్రామం చేర్చి ఇక్కడ భూమి సస్యశ్యామలం అయిందని ఇక్కడే పనులు చేసుకుంటూ జీవించండి అంటూ బాలిక అంతర్ధానమైంది. దీనితో ఆ కుటుంబం ఆ బాలికను దేవతగా కొలుస్తూ వస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఉన్న నాటి కర్రి వారి కుటుంబం సుసంపన్నంగా వేల సంఖ్య కు చేరుకున్నారు. అంతేకాకుండా అమ్మవారు మీరు పండించిన పంటలకు కాపలా కాస్తూ వారికి అండగా నిలుస్తుంది. నాటినుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి కర్రి వారి వంశీయులు సత్తెమ్మ తల్లి ఆడపడుచును కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు మిద్దె పైన కత్తిరి కుండను కిందకు దింపడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా దించిన కత్తెర కుండను సంతానం లేని మహిళల తలపై ఉంచితే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారికి మేక గొర్రె, గొర్రె పిల్లలు కానుకగా సమర్పిస్తారు. ఇక్కడ బలి నిషేధం కావడంతో అమ్మవారికి కానుకలుగా వచ్చిన గొర్రెపిల్లలను వేలం ద్వారా విక్రయిస్తారు. రెండవ రోజున ఊరి పొలిమేరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న నాగదేవతను పూజిస్తారు. ఈ పూజ కి వెళ్లే భక్తులు రకరకాల వేషాలు ధరించి అమ్మను కొలుస్తారు. పుట్ట నుండి గుడికి వచ్చిన క్రమంలో భక్తులు పూజారులను ఆలయంలోకి వెళ్లకుండ అడ్డు కుంటారు. దీంతో కోపోద్రిక్తులైన పూజారులు భక్తులపై జకులతో దండెత్తి బడిత పూజ చేస్తారు. ఇలా దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా మూడో రోజు ఆఖరి రోజైన సోమవారం జాతరలో చిత్ర విచిత్ర లతో అమ్మవార్ల జాతర్లు సాధారణంగా రాత్రి సమయాల్లో జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వెన్నెల లేకుండానే పట్టపగలు జరగడం ఓ విశేషం. అదేవిధంగా కోరికలు తీరిన భక్తులు సాధారణంగా తమకున్న సంపద నుండి కానుకలు సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులు జాతరలో ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేయాలి ఇలా భిక్షాటన చేయగా వచ్చిన బియ్యం, నగదు కానుకలను అమ్మవారికి సమర్పించాలి. దీంతో భక్తులు రకరకాల వేషాలు ధరించి జాతరలో భిక్షాటన చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ధనిక, పేద కుల మత విభేదాలు లేకుండా ప్రతి భక్తుడు భిక్షాటన చేస్తూ ఉండడంతో గ్రామమంతా బిచ్చగాళ్ళ మయంగా మారింది. ఈ వింతను చూసేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు రావడంతో గ్రామమంతా కిటకిటలాడింది. ఇలా భిక్షాటన చేసిన వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అదేవిధంగా కొన్ని బండ్ల పై వేషాలు కూడా ఆకట్టుకున్నాయి పుష్ప సినిమా స్పూఫ్ తో భక్తులు చేసిన నటన జాతరకు హైలెట్ గా నిలిచింది.
east godavari district news
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో వేడుకగా నిర్వహించిన స్వచ్ఛత – బాధ్యత కార్యక్రమం ధవళేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం ఆవరణలో పారిశుధ్య కార్మికుల సేవలకు గాను సన్మాన కార్యక్రమంలో పాల్గొని. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలతో కలిసి భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఇంచార్జ్, మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేణు గోపాలకృష్ణ. అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల లోని పారిశుధ్య కార్మికుల సేవలకు గాను సన్మాన కార్యక్రమం పాల్గొని పారిశుధ్య కార్మికులకు మంత్రి వేణు పాదపూజ చేసారు. నిజమైన సమాజ సేవకులు పారిశుధ్య కార్మికులని వారి సేవలు అమరామరం అని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతి పారిశుధ్య కార్మికులకు మేలు చేసే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయన్నారు.
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైఎస్ఆర్సిపి కార్యకర్త మోసగించాడు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మేర ధాన్యం సొమ్ము రావాలని రైతులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు అడగడానికి వెళ్తుంటే రైతులపై కేసులు పెడతామని కృష్ణారెడ్డి అతని కుమారులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. పొత్తంశెట్టి కృష్ణారెడ్డి అతని కుమారులు పై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసారు. రైతులకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కి వచ్చారు.
రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ కంచుకోట అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 జగన్ వేవ్ లో కూడా టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి గెలుపొందటమే ఉదాహరణగా చెప్పవచ్చు. 2,56,432 ఓటర్లు ఉన్నా ఈ నియోజకవర్గంలో బీసీలే అధికంగా ఉన్నారు. అదే అస్త్రంగా మలుచుకుంటు నియోజకవర్గానికి కంచుకోటగా మార్చుకున్నారు గోరంట్ల….టిడిపి పార్టీ ఏర్పాటు నుండి పార్టీలో కోనసాగుతూ అప్పట్లో ఎన్టీఆర్ కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు.
తొలిత రాజమండ్రి లో పోటీ చేసినప్పుటికి నియోజకవర్గాల పునర్విభజనలో రూరల్ లో పాగా వేశారు. అప్పటినుండి బలమైన నేతగా ఎదిగారు. ఒకానొక సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి రాక అలకపోని రాజీనామా వరకు వెళ్లిన పరిస్థితి. అయితే అధ్యక్షుడే రంగంలోకి దిగి బుజ్జగించడంతో వ్యవహారం సద్దుమణిగిందని చెబుతుంటారు. గోరంట్ల నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు కావడంతో అదే గాలి ప్రక్కన నియోజకవర్గం రాజమండ్రి కూడా తాకిందని సిటీ గెలుపుకు అదే కారణమని కొందరు చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జనసేన టిడిపి పొత్తుతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సీటుకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు కేటాయిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచిచూడాలి.
జగన్ 175 నియోజకవర్గాలు టార్గెట్గా ఇన్చార్జుల మార్పులో భాగంగా ఈ నియోజకవర్గంలో బిసి సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుకు కేటాయిస్తున్నారని ప్రచారం బలంగా వినిపిస్తుంది. అయితే బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గెలుపుకు ఇదే అస్త్రంగా వైసిపి మార్చుకోబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసిపి పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల వీర్రాజును వైసిపి పార్టీ పక్కన పెట్టింది. చందన రమేష్ వారసత్వాన్ని పుచ్చుకున్న చందన నాగేశ్వర్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. గడపగడపకు తిరుగుతూ నాగేశ్వర్ జోష్ పెంచినప్పటికీ గ్రూప్ తగాదాలను తట్టుకోలేకపోతున్నాడని గుసగుసలు కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి గారికి ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాజమండ్రి రూరల్ కడియం మండలాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రిగారు ఏ మాత్రం ఎదుర్కొంటారో చూడాలంటూ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు గందరగోళంగా మారుతుంది. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల బరిలో ఖచ్చితంగా ఉండాలని పెండం దొరబాబును కార్యకర్తలు కోరుతున్నారు. ఆ విషయమై పెండెం దొరబాబు హైదరాబాద్ కు వెళ్లారు. అది ఆలా ఉండగా ఎమ్మెల్యే దొరబాబు బంధువులు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. తాను 100 శాతం పోటీ చేస్తామని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కి హామీ ఇచ్చినట్లు సమాచారం అందింది. అధికార వైసిపి లిస్ట్ ప్రకటించిన తర్వాత దొరబాబు తన కార్యచరణ ప్రకటించనున్నారు. జనసేన నుండి పిఠాపురం బరిలోకి దిగేందుకు దొరబాబు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందింది.
అంగన్వాడి టీచర్లు, వర్కర్లు సమ్మె కొనసాగిస్తూ ఈరోజు కోరుకొండ ప్రాజెక్టు సంబంధించిన కోరుకొండ గోకవరం, సీతానగరం మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు, వర్కర్లు వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ జగన్ గారు గతంలో పాదయాత్ర సందర్భంగా అంగన్వాడి టీచర్లకు, వర్కర్లకు సంబంధించిన మా యొక్క న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమందికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మా అంగన్వాడి టీచర్లు వర్కర్ల విషయానికి వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు జగన్ గారు చిన్న సూపు చూస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించడం జగన్ గారికి చాలా చిన్న విషయం అయినప్పటికీ జగన్ గారు మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో చొరవ తీసుకుని మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం అని అంగన్వాడి టీచర్లు తమ ఆవేదన వ్యక్తపరిచారు.
రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట. ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది. వానరుల వేషధారణతో రైతులు తలంబ్రాల పంటను కోత కోశారు. తలంబ్రాలకు అవసరమైన పంటను వానర్లే స్వయంగా పండించుకుని కోతలు కోయడం చూపరులను ఆకట్టుకుంటుంది. గోటితో ఒలిచే కోటి తలంబ్రాల పంటకు పంచామృతాభిషేకం జరిగింది. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీరామ భక్తులు వానర వేషధారణలతో రాముని పంట కోత కోశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తన తల్లి పొలంలో 13 ఏళ్లుగా ఈ పంట పండిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తుల ఆలయంలో పూజించి తీసుకువచ్చిన ధాన్యాన్ని వరి నారువేసి, నాట్లు వేసి, పంట పండిస్తున్నారు. ఈ పంటపై వచ్చిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రామ భక్తులకు పంపించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు శ్రీరామనవమి పర్వదినం రోజున కోటి తలంబ్రాల కోసం పంపించడమే కాకుండా అయోధ్య రామునికి సైతం పంపించి అక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వానర వేషధారణలో పంట కోత కోయడం నిర్వహించారు. వరి కంకులకు పంచామృతాభిషేకం నిర్వహించి, పొలంలో ఉన్న రాముని ఆలయం వద్ద మహిళలతో శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వానర వేషధారణలతో ఉన్న రైతులు , కూలీలు రాముని పంట కోత కోశారు. ఆధ్యాత్మిక చింతనతో కొనసాగిన కోటి తలంబ్రాల పంట కోత అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ కోటి గోటి తలంబ్రాల కోసం పండించిన ఈ ధాన్యాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 800 కేజీల ధాన్యాన్ని రామభక్తులతో గోటితో ఒలిపించి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. భద్రాచలం ఒంటిమిట్ట రామాలయాలే కాకుండా అయోధ్య రామలయానికి లోక కళ్యాణం కోసం తీసుకువెళ్లి స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పి గన్నవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన మూడవ రోజు కొనసాగుతుంది. నిరసనలో భాగం గా వాళ్ళు వారి యొక్క డిమాండ్స్ చెప్పారు.
వారి డిమాండ్స్ఈ క్రింది విధముగా ఉన్నాయి……….
- అంగన్వాడి కార్యకర్తలకు తెలంగాణ కన్నా అధిక వేతనం ఇవ్వాలి.
- సుప్రీంకోర్టు తీర్పులననుసరించి తక్షణమే అంగన్వాడీలకు గ్రాడ్యుటి ని రాష్ట్రం అమలు చేయాలి.
- రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చి ప్రమోషన్లు ఇవ్వాలి.
- అంగన్వాడి టీచర్ గా రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచి, 50% పెన్షన్ గా ఇవ్వాలి.
- వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచి, గ్యాస్ ని ప్రభుత్వమే సరఫరా చేయాలి.
- హెల్పర్స్ ప్రమోషన్లు నిబంధనలను రూపొందించి, ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకి పెంచాలి.
- పెండింగ్లో ఉన్న అంగన్వాడి అద్దేలను మరియు 2017 టిఏ బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలి.
- అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులను పంపి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గo అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో పశువుల వైద్యశాలలో సిబ్బంది నిర్వాకం బయటపడింది. పశువులకు ఇచ్చే నుశిపురుగు నివారణ కోసం ఇచ్చే మందు వికటించి నాలుగు పశువులు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు. గత నాలుగు సంవత్సరాల నుండి పశువైద్యశాలలో వైద్యడు లేడు. ఆసుపత్రి వద్ద పాడి రైతులు నిరసన వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అర్భాటంగా ప్రారంభించిన పశువులకు అత్యవసర చికిత్స అందించేందుకు ప్రారంభించిన 1962 అంబులెన్స్ కు డ్రైవర్ లేకపోడంతో వైద్యశాల ఆవరణలో వాహనం నిర్వీర్యంగా పడి ఉంది. పాడి పశువులు చనిపోవడంతో పెదలంక గ్రామానికి చెందిన పాడి రైతులు లబోదిబోమంటున్నారు. డా.వై.యస్.అర్.సంచార పశు ఆరోగ్య సేవ వాహనం మూలాన పడి వేశారు.
లోక కళ్యాణార్ధం యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నిర్వహించిన హరిహర మహా యజ్ఞానికి ప్రజలు పోటెత్తారు. కార్తీకమాసం పర్వదినాలను పురస్కరించుకొని ప్రంపంచంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఈ యజ్ఞం నిర్వహించినట్లు అశోక్ తెలిపారు. ఉదయం వేకువ జామునుండి ప్రారంభమైన ఈ మహా యజ్ఞం గొల్లపల్లి శ్రీనివాస అశోక్ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హరిహర యజ్ఞం శివపార్వతుల కళ్యాణం, మహా మృత్యుంజయ హోమం, లక్ష బిల్వార్చన, రుద్రాక్షలతో అభిషేకం ఋత్విక్కులు నియమ నిష్టలతో అశోక్ దంపతులచే చేయించారు. యానాంకు చెందిన మహిళలచే లలితా సహస్రనామ కార్యక్రమం, గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. యానాం ప్రజలు, వరదలు, తుఫానులు వంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటినుండి పరమశివుడు యానాం ప్రజలందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అశోక్ తెలియచేసారు. సాయంత్రం గోదావరి మాతకు అంగరంగ వైభవంగా పంచహారతులు ఇవ్వనున్నారు.





Total views : 90609