డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలంలో ఇంకా ముంపు లోనే ఉన్న వరిచేలు, ఎనిమిది రోజులుగా ముంపులో ఉండటంతో చేలల్లోనే మొలకెత్తిన పంట. ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఇంకా ముంపులోనే ఉన్న వరిచేలను పరిశీలించిన అధికార జనసేన పార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ. రాజమండ్రి నాళంవారి సత్రం భూములను కౌలుకు తీసుకుని సాగు చేసామని ముంపుతో పంట పూర్తిగా దెబ్బతిని కౌలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, అధికారులుగాని, అధికార పార్టీ నాయకులు గాని కనీసం వచ్చి రైతులను పలకరించిన వాళ్లు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ.25 వేలు పరిహరం అందించాలని బాలకృష్ణ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల బాధలు తెలియవని, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. టిడిపి, జనసేనపార్టీ లు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
east godavari district news
తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది. కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది. ఇటివలే ఆధునికీకరణ చేసిన ఈ రహదారి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు ముఖ్యమైన రహదారని, పూర్తి గా దెబ్బతినకముందే రక్షణ చర్యలు చెపట్టి ఆధునికీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో పి గన్నవరం నియోజకవర్గంలో నిన్నటి నుండి ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దవుతున్న వరిచేలు, కోత కోసి పనల మీద ఉన్న వరి మరియు వరి రాశులు. ప్రభుత్వ గిట్టుబాటు ధర ఒకవైపు, పంట చేతికి వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలు మరొక వైపు.. ప్రతి రైతు అప్పులు పోరాటం తప్ప ఏ సీజన్లో కూడా రైతుకు ప్రభుత్వ పరంగా గాని ప్రకృతి పరంగా గాని ఏ విధమైన సహాయాలు అందట్లేదని రైతులు వాపోతున్నారు.. గతంలో ఏదో ఒక షావుకారు దగ్గర పంట వచ్చిన తర్వాత ఇస్తామని ఎరువులు లేకపోతే కూలీ డబ్బులు ఇవ్వడానికి అప్పులు తెచ్చుకునే వాళ్ళం.. పండించిన పంట ప్రభుత్వానికి అమ్మాలి అని నినాదం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం, తేమ ఎక్కువ ఉన్న ధాన్యం, కొనట్లేదని దాని వలన రైతులు అప్పుల పాలవుతున్నారని కౌలు రైతు కు వచ్చేసరికి సిస్తు కట్టాలి.. దుక్కులు చేయించాలి,ఎరువులెయ్యాలి పనిచేసిన ప్రతి ఒక్కరికి సాయంత్రానికి కూలి సరిపెట్టాలి ఎకరానికి సుమారు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి కొట్టే దెబ్బకు రైతు కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాడని ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించాలని రైతుకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వానికి మరియు అధికారులకు.. అభ్యర్థన చేసుకుంటున్నారు..
రావులపాలెం… మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం జలమయమయ్యింది.ప్రాంగణం పూర్తిగా నీట మునగడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే బస్ స్టేషన్ బోసిపోయి కనిపించింది. ప్రయాణికులు జాతీయ రహదారిపై బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also…
Read Also…
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన యువగళం పాదయాత్ర గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను, అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు. రెండో రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. ముమ్మిడివరం యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. పేదల కడపు నింపేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను మూసివేసి సీఎం జగన్ పైశాచికానందం పొందారని విమర్శించారు. పాదయాత్రలో అన్నా క్యాంటీన్‌ను వార్డు సచివాలయంగా మార్చడని గమనించిన లోకేశ్.. అక్కడే నిలబడి సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాన్ని, ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చేశారని మండిపడ్డారు
మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే అందుకు కారణం సీఎం జగన్ అన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరలా అధికారంలోకి తామే వస్తామని.. జగన్ సీఎంగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయమన్నారు. ఎంతటి వారికైనా కొన్ని లోటు పాట్లు వుంటాయని… అవి కూడా తొందర్లోనే పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని అన్నారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నాడని విమర్శలు చేశారు. ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్ళీ జగన్ ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు, మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించండి. ఎస్సీల్లో అత్యధిక జనాభా కలిగిన మాకు అన్యాయం చేసేలా కొన్ని స్వార్థపర శక్తులు తెరపైకి తెస్తున్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపవద్దని కోరుతున్నాం.
నారా లోకేష్ మాట్లాడుతూ…
నా ఎస్సీలు, బిసిలు అంటున్న జగన్మోహన్రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన 27సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక , రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై జగన్ సర్కారు తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టిడిపి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకాలను పునరుద్దరిస్తాం.
Read Also…
Read Also…
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు బొంతా మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇచ్చేందుకు వెళ్లిన హోం మంత్రిని రోడ్డుపైన నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుకు కృషి చేస్తే.. మాకు చావును బహుమానంగా ఇస్తారా? మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు.. ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు? మేం చెప్పగానే పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి హోం మంత్రి వనిత దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని మాత్రం అడ్డుకుని ఆమెను రోడ్డుపైనే ఆపేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. మా గ్రామంలోకి మీరొచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు. మరోవైపు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన మంత్రినాగార్జున, వెంకట్రావు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, వైసీపీ నాయకుడి తరఫున రూ.10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యావరం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు కొఠారు అబ్బాయి చౌదరి పాల్గొన్నారు… మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందుగా భూమి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు…అనంతరం మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ గతంలో 20.000 పలికే పామ్ ఆయిల్ ధర ప్రస్తుతం 13000 రూపాయలు మాత్రమే ధర పలకడంతో పామాయిల్ రైతులు తీవ్ర నష్టంలో కురిపోయిన విషయం తెలిసిందేనని దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తున్నరని అన్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి… మెట్ట ప్రాంత రైతులకు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికి దొరుకుతుందని, పామెయిల్ రైతులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు…భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 90% ఫామిలీ పంట కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అది కూడా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని పామెయిల్ పంటను సాగు చేయడం జరుగుతుందని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు …
రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు.తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యావరం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు కొఠారు అబ్బాయి చౌదరి పాల్గొన్నారు…మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా భూమి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు…అనంతరం మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ గతంలో 20.000 పలికే పామ్ ఆయిల్ ధర ప్రస్తుతం 13000 రూపాయలు మాత్రమే ధర పలకడంతో పామాయిల్ రైతులు తీవ్ర నష్టంలో కురిపోయిన విషయం తెలిసిందేనని దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డికేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తున్నరని అన్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి…మెట్ట ప్రాంత రైతులకు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికి దొరుకుతుందని, పామెయిల్ రైతులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు…భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 90% ఫామిలీ పంట కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అది కూడా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని పామెయిల్ పంటను సాగు చేయడం జరుగుతుందని
మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు …






Total views : 90629