తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను,జగనన్న కాలనీలను పరిశీలించారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీటిలోనే… పంట నాని ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సిఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నాం అనడం సరికాదనీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి రైతుల పరిస్తితి తెలుసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు వర్షపు నీటిని జగన్న కాలనీలు అధ్వానంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా మారాయన్నారు. సరైన సౌకర్యాలు లేక కాలనీల్లో ఉంటున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తుఫాను ప్రభావంతో వాణిజ్య పంటలు దెబ్బతిని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.అరటి తోటలు గాలుల ప్రభావానికి నేల వాలయి ..కంద,పసుపు పంటలు వర్షపు నీటితో నాని రైతులకు నష్టం వాటిల్లింది.చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
94
previous post