ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఫైనాన్స్ కంపెనీల్లో దొంగతనాలకు ప్రయత్నిస్తున్న ఓ దుండగుడును పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు చేరుకుని దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిసిఎస్ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని సంఘటనలు జరిగిన తీరును పరిశీలించారు. ఐదో తారీకు అర్ధరాత్రి ముత్తూట్ ఫైనాన్స్ చోరీకి ప్రయత్నించిన దుండగుడు, ఎనిమిదో తారీకు అర్ధరాత్రి ఫైనాన్స్ కంపెనీలో చోరీకి ప్రయత్నించిన దుండగుడు, రెండు చోట్ల చోరీకి ప్రయత్నించిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్న పోలీసులు, రెండు ఫైనాన్స్ కంపెనీల వద్ద స్థానిక పోలీసులతో కలిసి వివరాలు సేకరిస్తున్న ఏలూరు సిసిఎస్ పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని లాడ్జిలలో చెక్ చేస్తున్న నూజివీడు పట్టణ పోలీసులు, రెండు నేరాలలో ఒకే వ్యక్తి పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి. మురళి కృష్ణ టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల వద్ద, ఫైనాన్స్ కంపెనీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ నియమించుకోవాలని, నష్టం జరిగాక ఇబ్బంది పడే దానికన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి.మురళీకృష్ణ సూచించారు.
Read Also…
Read Also….