ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల్లో భాగంగా ఆర్‌బీఐ రెండు కీలక ప్రకటనలు చేసింది. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని, రికరింగ్ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్ మొత్తాన్ని పెంచింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించేందుకు అనుమతి ఉంది. దీన్ని 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభించింది.
Read Also..
Read Also..