బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్నా కూడా బరువు పెరిగిపోరు. బొప్పాయిని తీసుకోవడం వల్ల మరో ముఖ్యమైన లాభం ఉంది. అదేమిటంటే గుండెకు రక్తం సరఫరా అయ్యేటట్టు బొప్పాయి చూసుకుంటుంది. అలానే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే వారికి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా బొప్పాయితో కరుగుతాయి. అలానే అలసట నీరసం ఉన్న వాళ్ళకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని అభివృద్ధి చేసి బలాన్నిస్తుంది. క్యాన్సర్ తో కూడా పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. కోలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి కూడా తగ్గుతాయి. అంతే కాదు పళ్ళు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. నారింజ, ఆపిల్‌లో కంటే బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ ని మృదువుగా సున్నితంగా కోమలంగా మారుస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం బొప్పాయిని తినకూడదు చూసుకోండి.
బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు
69
previous post