చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చేపల్లో బీపీని, కొలెస్ట్రాల్ ని, డయాబెటిస్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. చేపలని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిరోధక శక్తి పెరగడానికి కూడా చేపలు ఎంతో దోహదపడుతాయి. చేపలు శరీరానికి చాలా అవసరం ఎందుకంటే చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో ఒమేగా – 3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కడుపులో మంట, వేడి తగ్గాలన్న తప్పనిసరిగా చేపలు తీసుకోవాలి. ఇంకా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు వంటి లక్షణాలను చేపలు తగ్గిస్తాయి. చేపల్లో విటమిన్ – డి అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేటట్లు తెలుస్తాయి. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయి. చేపల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని గ్లోబిన్ శాతం సరిపడేలా చేస్తుంది. పేగులో క్యాన్సర్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఎనర్జీగా ఉండేటట్లు చేస్తాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో అయోడిన్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. కడుపులో బిడ్డకు మెదడు పెరిగేందుకు ఉపయోగపడతాయి. మన శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోతే చేపలను తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో వుండే పొటాషియం శరీరంలో ద్రవాలు తయారవడానికి చాలా అవసరం. కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం అందుకే చేపలను తినడం వల్ల పొటాషియం అందుతుంది.
Colon Cancer
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్నా కూడా బరువు పెరిగిపోరు. బొప్పాయిని తీసుకోవడం వల్ల మరో ముఖ్యమైన లాభం ఉంది. అదేమిటంటే గుండెకు రక్తం సరఫరా అయ్యేటట్టు బొప్పాయి చూసుకుంటుంది. అలానే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే వారికి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా బొప్పాయితో కరుగుతాయి. అలానే అలసట నీరసం ఉన్న వాళ్ళకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని అభివృద్ధి చేసి బలాన్నిస్తుంది. క్యాన్సర్ తో కూడా పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. కోలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి కూడా తగ్గుతాయి. అంతే కాదు పళ్ళు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. నారింజ, ఆపిల్లో కంటే బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ ని మృదువుగా సున్నితంగా కోమలంగా మారుస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం బొప్పాయిని తినకూడదు చూసుకోండి.
ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది. దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది. అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది. ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది. ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ. స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం. ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి. కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది.
Read Also..
Read Also..





Total views : 61961