58
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా, జనవరిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు. జనవరి 22న మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతేకాదు, 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.