టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున ఆటోల ర్యాలీ చేపట్టారు టీడీపీ సీనియర్ నేత, టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ యువగలం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలు రాయికి చేరుకుందన్నారు. యువగళం పాదయాత్రకు ప్రజలు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నారన్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా స్వచ్ఛందంగా ఆటోలు పాల్గొనటం చూస్తే టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఖాయమనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశానికి వస్తున్న ప్రజా ప్రభంజనానికి వైసీపీ నేతల గుండెల్లో వణుకు మొదలయిందంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సైకో పాలను కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందన్నారు. సైకో పాలనుకు ప్రజలు చరమగీతం పాడాలని కోరుతున్నామంటూ వ్యాఖ్యానించారు.
Read Also..
Read Also..