2023-24సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ర్టవ్యాప్తంగా 2,807మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫెండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున వారి ఖాతాల్లో వేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు. నాలుగన్నరేళ్లలో 49కోట్ల రూపాయలు అందించామన్నారు. 100కోట్ల రూపాయలతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామన్నారు. పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలని తెలిపారు. కోవిడ్ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడిందని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా యువ లాయర్లు పేదలకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు.
Read Also..