తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని ఇసుక ర్యాంపుల్లో ఇసుక దందా యదేచ్ఛగా కోనసాగుతోంది. గోదారమ్మ గర్భాన్ని చీల్చి యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు కాంట్రాక్టర్లు. రాత్రి అయితే చాలు గోదావరి గట్టు వెంబడి డ్రజ్జర్ మోత మోగుతోంది. డ్రజ్జర్ లతో ఇసుక కాంట్రాక్టర్లు కాసులు దండుకుంటున్నారు. గంటకు ఒక డ్రజ్జర్ కి మూడు నుంచి ఐదు లారీల వరకు ఇసుక సేకరణ జరుగుతుంది. సాధారణంగా ఇసుకను సేకరించేందుకు సాంప్రదాయ పద్ధతిలో పడవల ద్వారాకార్మికుల ద్వారా ఇసుక సేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ లో సొమ్ములు దక్కకపోవడంతో ఇసుకాసురులు యంత్రాలను వాడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం గోదావరి నదిలోఎటువంటి యంత్రాలను వాడకూడదని ఆదేశాలున్నాయి. ఇటీవల హైకోర్టు సైతం ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. అయినా లెక్క చేయకుండా ఇసుక కాంట్రాక్టర్లు యదేచ్ఛగా ఇసుకను డజ్జర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. హోం మంత్రి తానేటి వనిత ఇలాకా కావడంతో అధికారులు కన్నెత్తి చూడడానికి జంకుతున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు అండదండలతోనే యదేచ్చగా దందా,రవాణా జరుగుతున్నట్లు బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు రోజుకు ఇంత అనే విధంగా సొమ్ము కాంట్రాక్టర్లు ముట్ట చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు సిద్ధమంటూ పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అక్రమ ఇసుక దందా….
76
previous post