చట్టాన్ని అతిక్రమించి నేరాలకు, అక్రమాలకూ పాల్పడే వారి పై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి లో డిఎస్పి కార్యాలయాన్ని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు డి ఐ జి సెంథిల్ కుమార్, కలెక్టర్ గిరిషా పి ఎస్, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు. ముందుగా వారు పోలీస్ కమాండో గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత పోలీసు సిబ్బంది, ఇతరులు ఫ్లవర్ బుక్కేలతో పాటు శాలువాలతో సన్మానించి వారికీ ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పి కార్యాలయం, ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లు నిర్మాణాలను వేగంగా పుర్తియ్యేందుకు సహకరించిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, చట్టబద్దంగా తాము పని చేస్తున్నామని మాకు అన్ని రాజకీయ పార్టిలు సమానమేనని ఎ పార్టీ పట్ల వివక్షత చూపమని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువై వారికీ మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. ఇటివల వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన పట్ల పూర్తిగా విచారణ చేపట్టామని దోషులు ఎవ్వరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లా పోలీసు సిబ్బంది కొరత లేకుండా సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే పోలీసు నియామకాలు చేపట్టి పోలీసు సిబ్బంది కొరత లేకుండా చేస్తామని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్యా తగ్గు ముఖం పట్టిందని తెలియజేశారు. దిశా యాప్ ని సుమారు కోటి యాబై లక్షల మంది తమ సెల్ ఫోన్ లలో నమోదు చేసుకోన్నరన్నారు. దిని ద్వారా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారి పై క్షణికకాలంలోనే సమాచారం అందుతుందని, అలాంటి కామందులు, ఆకతాయిలకు దండన తప్పదని హెచ్చరించారు. ఇటివల కాలంలో అవగాహనా లోపంతో కుటుంబ కలహాలు ఎక్కువ అయ్యాయని భార్యాభర్తలు, కుటుంబ సభ్యులకు తగిన రీతిలో కౌన్సలింగ్ ఇచ్చి వారి కాపురాలు సజావుగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. అజాగ్రత్తల కారణంగానే, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి యువకులు అతివేగంగా వాహనాలు నడుపుతుండడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అన్నిరకాల చర్యలతో అడ్డుకట్ట వేస్తున్నామని వివరించారు. రాయచోటి పట్టణంలో మరొక పోలీసు స్టేషన్ కు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తమను కోరారన్నారు. అందుకు త్వరలోనే పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు.
నేరాలకు పాల్పడితే ఉక్కుపాదం…..
61
previous post