రాజకీయంగా తనకు మరోసారి హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ను గజమాలతో సత్కరించి, పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత తనదన్నారు. సెంటిమెంట్ కాదు, హుస్నాబాద్ లో డెవలప్మెంట్ మొదలయిందని పేర్కొన్నారు. భూనిర్వాసితులను బతిమిలాడైనా నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని వెల్లడించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తానని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మందరం కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిగా అభివృద్ధి చేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికెళ్లిన గళ్ళ ఎగిరేసుకునే విధంగా పనిచేస్తానని, ప్రతిరోజు ఉదయం హుస్నాబాద్ లో ఉంటే, సాయంత్రం హైదరాబాద్ లో, సాయంత్రం హైదరాబాద్ లో ఉంటే ఉదయం హుస్నాబాద్ లో ఉంటానన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చింది – మంత్రి పొన్నం
59
previous post