భారతీయులు ఎక్కువగా తినే ఆహారాల్లో వరి అన్నం తర్వాతి స్థానం చపాతీదే. బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంది చెప్పే సలహా అన్నం తినడం మానేసి చపాతీ తినమని అంటారు. మధ్యాహ్నం అన్నం, రాత్రి వేళ ఒకటీ రెండూ చపాతీ తినాలన్నది చాలా మంది సూచన. చపాతీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఎక్కువ సేపు కడుపు నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు. అసలు బరువు తగ్గడానికి రోజూ ఎన్ని చపాతీలు తినాలి, ఎప్పుడు తినాలి, చపాతీలు ఎలా తింటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చపాతీలోని పోషక విలువలు ఒక చపాతీలో (27గ్రా) ఎన్ని పోషకాలు ఉంటాయంటే కొవ్వు – 2.5గ్రా , ఉప్పు – 80 మి.గ్రా , పొటాషియం – 53 మి.గ్రా , కొలెస్ట్రాల్ – 0 మి.గ్రా , కార్బోహైడ్రేట్లు – 12 గ్రా , ప్రోటీన్ – 2.1 గ్రా , ఫైబర్ – 2.6 గ్రా సాధారణంగా చపాతీలో(నెయ్యి లేదా నూనె కలపని) అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే అందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. చపాతీలో విటమిన్ బి1, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఇ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా చపాతీ ద్వారా లభిస్తాయి. ఒక చిన్న చపాతీలో దాదాపు 81 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రోజుకు నాలుగు చపాతీలు తినాలని అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు మధ్యాహ్న భోజనంలో చపాతీలు తీసుకుంటే ఇతర ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. 50 కేలరీలకు మించకుండా చపాతీలు, కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటున్నట్లు అనిపిస్తే చపాతీ సంఖ్యను తగ్గించుకోవాలి.
Read Also..
Read Also..