83
మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్ల గా వచ్చిన సినిమా విరూపాక్ష. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ్ కెరియర్ మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవి కృష్ణ. అజినీస్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023 లో రిలీజ్ అయిన మూవీస్ లో థ్రిల్లర్ జానర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థియేటర్ లో రిలీస్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో కూడా దుమ్ము లేపింది. Netflix 2023 1వ హాఫ్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌లో 8.7 మిలియన్ వాచ్ అవర్స్ (అన్ని లాంగ్వేజెస్) సాధించింది.